![]() |
![]() |
.webp)
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -385 లో....దీపని కార్తీక్ పిలుస్తాడు. వస్తున్నా బావ అని దీప అనగానే.. అందరు ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటే పిలుపు మారిందని అనసూయ అనగానే అలా పిలిస్తే ఏంటని కార్తీక్ అంటాడు. మీరు మా అమ్మని అక్క అని పిలుస్తున్నారు కదా.. నేను దీపని బావ అని పిల్వమన్నానని కార్తీక్ అంటాడు. మరి దీప అలా పిలిస్తే మీరు కూడా పిలవాలి కదా అని అనసూయ అనగానే.. మరదలు అనే కదా పిలుస్తున్నానని కార్తీక్ అంటాడు.
నిజంగా దీప నా మేనకోడలు అయితే ఎంత బాగుండు.. ఇక నుండి నన్ను అత్త అని పిలువు.. నిన్ను కూడా మేనకోడలు అని పిలుస్తానని కాంచన అంటుంది. దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కార్తీక్, దీప అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఏ తల్లి కన్నబిడ్డో మీరు దగ్గర అయ్యారని కాంచనతో అనసూయ అనగానే.. ఏ తల్లి కన్న బిడ్డో ఏంటి? నీకు తెలియదా దీప తల్లి ఎవరోనని కాంచన అంటుంది. అంటే తెలుసు.. మీకు తెలియదు కదా.. అని అనసూయ కవర్ చేస్తుంది. ఆ తర్వాత కార్తీక్, దీప కలిసి శివన్నారాయణ ఇంటికి వెళ్తారు. వాళ్ళని వద్దని సుమిత్ర చెప్తుంది. దీప ఇక నుండి నాకు కన్పించడానికి వీల్లేదని సుమిత్ర అంటుంది.
నాకు ఇష్టం లేదని శివన్నారాయణ అంటాడు. లేదు తను పని చేయాలిసిందేనని జ్యోత్స్న అంటుంది. నేను రాను కానీ ఒక కండిషన్ అని దీప అనగానే.. ఏంటని పారిజాతం అడుగుతుంది. నేను రావద్దు అంటే నా భర్త కూడా వద్దని దీప అనగానే అలా ఏం వద్దు ఇద్దరు రండి అని జ్యోత్స్న చెప్తుంది. మీ ఇష్టం అన్నట్లుగా సుమిత్ర కోపంగా ఉంటుంది. శివన్నారాయణని తాత అని పిలుస్తాడు కార్తీక్. నన్ను అలా పిల్వకని శివన్నారాయణ అనగానే.. సరే మీరు ఓనర్ లు మేమ్ వర్కర్లం.. ఇక సర్ మేడం అని పిలుస్తామని కార్తీక్ అంటాడు. అదంతా చూసిన జ్యోత్స్న.. ఏంటి ఇలా జరుగుతుందని టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |